Saturday, October 9, 2021

అహం-అజ్ఞానం

అహంకారమైన ఆటలో

అజ్ఞానమైన బాటలో

అశాశ్వతమైన ఆనందం

అందమనే అంధకారం


మాటలలో ఉన్న కట్టు

చేతలలో లేని పట్టు

మా మనంతో మొదలై

నా నేనుతో ముగిసెనే!


భయం కబళించిన వేళ

భీతిల్లె చిన్న హృదయం

మూర్ఖత్వం ఆవహించిన మేధ

నిర్ణయం అక్షర అసమంజసం


మనిషిని మనిషిగా మరిచి

మనిషిగానే మార్చాలనే యత్నం

ఆ మనిషిలో లేని వైకల్యం

మరి నీ దృష్టిలోన లేక నీలోన?